చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా రామ్ చరణ్ పూజలు

chiru-ram-charan
ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే చిరంజీవి పుట్టినరోజు కోసం ‘నవ జన్మదిన పూజా మహోత్సవాలు’ కూడా మొదలుపెట్టారు అభిమానాలు. ఇందులో భాగంగా వివిధ దేవాలయాల్లో జరిగే పూజా కార్యక్త్రమాలకు పలువురు మెగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హాజరయ్యారు.

అలాగే ఈరోజు ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానంలో జరగబోయే పూజా కార్యక్రమాలకు చిరు తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హాజరుక్నున్నారు. దీనితో పాటు చెర్రీ ఈరోజు తన తండ్రికి ఒక స్పెషల్ పెయింటింగ్ ను కూడా గిఫ్ట్ గా ఇవ్వనున్నాడు. ఇకపోతే వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ‘ఖైదీ నెం.150’ చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ టీజర్ సాయంత్రం శిల్పకళావేదికలో వేడుకగా విడుదల కానుంది.