పునీత్ రాజ్ కుమార్ ఇంటికి రామ్ చరణ్!

Published on Nov 3, 2021 9:41 am IST

కన్నడ స్టార్ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు తో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అతని మరణం పట్ల కన్నడ సినీ పరిశ్రమ తో పాటుగా, ఇతర సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన కి ఘన నివాళి అర్పించారు. టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు, అభిమానులు పునీత్ కి నివాళి అర్పించారు.

అయితే నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లనున్నారు. నేడు ఉదయం 11 గంటలకు పునీత్ రాజ్ కుమార్ గృహానికి చేరుకొని నివాళి అర్పించనున్నారు.

సంబంధిత సమాచారం :