లేటెస్ట్ : రాకింగ్ లుక్ లో అదరగొట్టిన రామ్ చరణ్

లేటెస్ట్ : రాకింగ్ లుక్ లో అదరగొట్టిన రామ్ చరణ్

Published on Dec 3, 2022 12:00 AM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకడు శంకర్ తో తన కెరీర్ 15వ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. అందాల నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీకి సంబందించిన ఒక అద్భుతమైన సాంగ్ ని న్యూజిలాండ్ లో చిత్రీకరించింది యూనిట్.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పై మెగాఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే, నేడు ఒక స్పెషల్ ఈవెంట్ కోసం ఢిల్లీ వెళ్లిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, లేటెస్ట్ ట్రెండీ స్టైల్ వైట్ కలర్ డ్రెస్ లో రాకింగ్ గా అదరగొట్టారు. అనంతరం స్థానిక మీడియా ఆయనని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం జరిగింది. కాగా ప్రస్తుతం ఆ పిక్స్ మీడియా మాధ్యమాల్లో ట్రెండింగ్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు