‘రామ్ చరణ్’ సినీ కెరీర్ లోనే బెస్ట్ లుక్ ఇదే !

‘రామ్ చరణ్’ సినీ కెరీర్ లోనే బెస్ట్ లుక్ ఇదే !

Published on Jul 4, 2022 12:00 PM IST


క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‍ డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. వెరీ స్టైలిష్ లుక్ లో విభిన్న శైలితో చరణ్, ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌ గా నిలుస్తాడట. పైగా ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట. చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పనిచేస్తున్నాడు. అలీమ్ హకీమ్ ఈ మెగా హీరో కోసం కొత్త లుక్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా శంకర్ ఈ సినిమాని చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు