‘ధృవ’కి స్పెషల్ హైలైట్‌గా చరణ్ సిక్స్‌ప్యాక్ లుక్!
Published on Nov 29, 2016 1:07 pm IST

ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమాపై ఏస్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్టార్ కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పక్కాగా సిద్ధమైపోయింది. ఇక విడుదలకు ఇంకా పదిరోజుల సమయమే ఉండడంతో టీమ్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే గత శుక్రవారం విడుదల అయిన ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకొని దూసుకుపోతోంది.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగానే, టీమ్, చరణ్ సిక్స్‌ప్యాక్ లుక్ గురించి చెబుతూ సినిమాకు స్పెషల్ హైలైట్‌గా ఈ అంశం నిలుస్తుందని తెలిపింది. ఇప్పటికే టీజర్స్‌లో ఈ సిక్స్‌ప్యాక్ లుక్‌ను పరిచయం చేసినా, ధృవ అనే టైటిల్ సాంగ్‌లో ఫుల్ లెంగ్త్‌లో సిక్స్ ప్యాక్ షాట్స్ ఉంటాయట. రామ్ చరణ్ ధృవ అనే ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించిన ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్‌గా నటించారు. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్!

 
Like us on Facebook