రామ్ చరణ్ అభిమానులకు శుభవార్త !

dhruva
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ధృవ’. తమిళ ‘తనీ ఒరువన్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఇంకో ఆరు రోజుల్లో ఈ చిత్రం యొక్క టాకీ పార్టీ పూర్తవుతుంది. ఆ తరువాత మిగిలిన రెండు పాటలు చిత్రీకరణ జరుగుతుంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

ఇకపోతే మెగా అభిమానులు, చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ను ఈ దసరాకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చరణ్ టీమ్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముందుగా సినిమాని ఈ దసరా కానుకగా రిలీజ్ చెయ్యాలని అనుకోగా కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా అరవింద స్వామి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.