రికార్డుల వేట మొదలుపెట్టేసిన రామ్ చరణ్!

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమాపై ఏస్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్టార్ కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పక్కాగా సిద్ధమైపోయింది. ఇక విడుదలకు ఇంకా పదిరోజుల సమయమే ఉండడంతో టీమ్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే గత శుక్రవారం విడుదల అయిన ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకొని దూసుకుపోతోంది.

విడుదలైన 48 గంటల్లోపే ఈ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో 3 మిలియన్ వ్యూస్ రావడం విశేషంగా చెప్పుకోవాలి. తెలుగులో ఇంత త్వరగా 3 మిలియన్ సాధించిన ట్రైలర్ మరొకటి లేదు. దీంతో రామ్ చరణ్ రికార్డుల వేట ఇప్పట్నుంచే మొదలైందని అనాలి. ఇదే ట్రైలర్‌కు 50 వేలకు పైనే లైక్స్ కూడా వచ్చాయి. రామ్ చరణ్ ధృవ అనే ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించిన ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్‌గా నటించారు. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించారు. ఇక విడుదలకు ముందే ఎంతో ఆసక్తి రేకెత్తిస్తూ రికార్డుల వేట మొదలుపెట్టిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా నిలబడుతుందో వేచిచూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి