
రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాతో వెలుగులోకి వచ్చిన తార షాజాన్ పదాంసీ ఈ మధ్య బాగా బిజీగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు ఒక బాలీవుడ్ సినిమాలో ఐటెం సాంగ్ కి చిందేస్తూ గాయపడింది.
ఒక కష్టమైన మూమెంట్ ని ప్రాక్టీస్ చేస్తూ హై హీల్స్ వేసుకోవడంతో పట్టు తప్పి కాలు జారి పడిపోయింది. ఈ గాయంతో వీల్ చైర్ కి మాత్రమే అంకితమైంది. షాజన్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.