చారిత్రాత్మక ఘట్టాన్ని పూర్తి చేసుకున్న ‘కొణిదెల ప్రొడక్షన్స్’ !

29th, April 2017 - 02:14:35 PM


రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించి నేటికి సరిగ్గా ఏడాది గడిచింది. రామ్ చరణ్, చిరంజీవి లు కలసి గతేడాది పూజా కార్యక్రమాలతో కొణిదెల ప్రొడక్షన్ ని ప్రారంభించారు. ఆ తరువాత రామ్ చరణ్ నిర్మాతగా ఈ బ్యానర్ నుంచి చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెం.150 వచ్చింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా బాహుబలి తరువాతి స్థానం లో నిలిచింది.

కాగా ఇదే బ్యానర్ నుంచి చిరంజీవి 151 వచిత్రం కూడా రాబోతోంది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రం ద్వారా తన తండ్రికి మరో ఘనవిజయం అందించాలని రామ్ చరణ్ ఆసక్తిగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం ఆగష్టు నుంచి ప్రారంభం కానుంది.