రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ లేటెస్ట్ షూట్ అప్ డేట్

Published on Sep 11, 2023 6:30 pm IST

యువ నటుడు రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ తో కూడిన మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ స్కంద సెప్టెంబర్ 28న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి థమన్ సంగీతం అందించారు. అయితే ఇటీవల డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో రామ్ చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ పెద్ద సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

కాగా దానికి సీక్వెల్ గా ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. పూరి కనెక్ట్స్ సంస్థ పై పూరి జగన్నాథ్ తో కలిసి ఛార్మి ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం కీలక సన్నివేశాలను ముంబై లో గ్రాండ్ గా చిత్రీకరిస్తోందట యూనిట్. మంచి యాక్షన్ తో పాటు పవర్ఫుల్ మాస్ అంశాలతో పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ 2024 సమ్మర్ కానుకగా మార్చి 8న గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :