ఆర్జీవీ కంబ్యాక్.. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన వర్మ

ఆర్జీవీ కంబ్యాక్.. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన వర్మ

Published on Jan 22, 2025 4:03 PM IST

ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి చాలా మంది టాప్ మోస్ట్ దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఎట్ చేసుకున్న యునిక్ నెస్ వేరే అని చెప్పాలి. ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర అదరగొడుతున్న ఎంతోమంది దర్శకులకి తాను ప్రేరణగా నిలిచారు. కానీ క్రమేణా రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమాలు చేస్తూ వచ్చారో అందరికీ తెలిసిందే.

అయితే రీసెంట్ గానే తన కల్ట్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైన “సత్య” మళ్ళీ చూసేసరికి తనకి జ్ఞానోదయం అయ్యినట్టుగా చెప్పుకొచ్చి ఇక నుంచి మంచి సినిమాలే చేస్తానని తెలిపారు. ఇలా లేటెస్ట్ గా సత్య ఇన్సిడెంట్ తర్వాత భారీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తున్నట్టుగా తాను తెలిపారు. “ఒక్క మనిషి అత్యంత భయంకరమైన మృగంగా మారగలడు” అంటూ ఒక సాలిడ్ లైన్ తో స్టార్ట్ చేసి “సిండికేట్” అనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని తాను అనౌన్స్ చేస్తున్నట్టుగా తెలిపారు.

1970ల దశకంలో జరిగే కథగా ఒక గ్యాంగ్ స్టర్ డ్రామా అన్నట్టుగా దీనిని కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ చిత్రం చాలా భయానకంగా ఎలాంటి అతీత శక్తుల ఎలిమెంట్స్ లేకుండా కేవలం మనిషి ఎంత భయంకరంగా భయపెట్టగలడు అనే కోణాన్ని చూపించగలడు అనేదే తన సినిమా సారాంశం అన్నట్టుగా వెల్లడి చేసారు. అలాగే సినిమా నటీనటులు ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తాను అని తెలిపారు. మరి ఇదే మార్పు తన నుంచి తన ఫాలోవర్స్ ఎప్పుడు నుంచో కోరుకుంటున్నారు. మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తో వర్మ కం బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఇండియన్ సినిమాకి తానేంటో ప్రూవ్ చేస్తారో లేదో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు