బాలయ్య షోపై వర్మ కాంప్లిమెంట్.. కోరిక నెరవేరేనా?

Published on Jan 20, 2022 1:02 am IST

వివాదస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉంటాడన్నది మనందరికి తెలిసిన విషయమే. సాధారణంగా వర్మ దేనిపైనైనా మనసు పారేసుకోవడం కానీ, నచ్చిందని పాజిటివ్ కామెంట్స్ చేయడం వంటివి కానీ చేయడం చాలా అరుదనే చెప్పాలి. కానీ తాజాగా బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న “అన్‌స్టాపబుల్” కార్యక్రమానికి వర్మ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే ఇప్పటివరకు ఏ షోకు నన్ను పిలవండని అడగని వర్మ బాలయ్య హోస్టింగ్ చేస్తున్న అన్‌స్టాపబుల్‌ కార్యక్రమం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇదో స్ట్రాటో ఆవరణ ప్రోగ్రామ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు ఈ షోలో పాల్గొని మాట్లాడాలనుకుంటున్నానని, బాలయ్య గారు ఈ అవకాశం ఇస్తారని అనుకుంటున్నానని ట్వీట్ చేశాడు. అయితే ఏమయ్యిందో ఏమో కానీ కొద్దిసేపటికే వర్మ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఆ ట్వీట్ వైరల్ కావడంతో వర్మను బాలయ్య తన షోకు ఆహ్వానిస్తారా? ఒకవేళ అవకాశం వస్తే వీరి ఇద్దరి మధ్య సంభాషణ ఎలా జరుగుతుంది? అనేదానిపై నెటిజన్ల మధ్య చర్చ నడుస్తుంది. చూడాలి మరీ వర్మ కోరిక నెరవేరుతుందా లేదా అనేది.

సంబంధిత సమాచారం :