నాకు తెలిసింది ఈ నాని ఒకడే..వర్మ కామెంట్స్ వైరల్.!

Published on Jan 5, 2022 9:03 pm IST

మన టాలీవుడ్ సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. టాలీవుడ్ గత కొన్నాళ్ల నుంచి ఎదుర్కొంటున్న టికెట్ ధరల ఇష్యూ కి సంబంధించి గత కొన్ని రోజులు నుంచి రామ్ గోపాల్ వర్మ పలు కీలక ప్రశ్నలనే కురిపిస్తున్నాడు. దీనికి గాను బదులుగా అటు ఏపీకి చెందిన మంత్రుల నుంచి కూడా సమాధానాలు వస్తుండగా వర్మ తాజాగా చేసిన ఓ కామెంట్స్ అయితే మరింత స్థాయిలో వైరల్ అవుతున్నాయి.

ఆ మధ్య మన టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని చేసిన కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున సంచలనం రేపగా నానీకి కూడా పలు కౌంటర్లు పడ్డాయి. మరి ఈ రీతిలోనే వర్మ కూడా కౌంటర్ అటాక్ చెయ్యడం వైరల్ అయ్యింది. నాకు కౌంటర్ ఇచ్చిన ఎవరో నానికి నన్ను కౌంటర్ ఇవ్వమని అందరూ అడుగుతున్నారు. ఆ నాని ఎవరో నాకు తెలియదు నాకు తెలిసిన నాని ఒకడే అతను కూడా న్యాచురల్ స్టార్ నాని ఒకడే ఇంకా ఏ నాని కూడా నాకు తెలీదు అని వర్మ కౌంటర్ అటాక్ చేశారు. దీనితో ఈ పోస్ట్ వైరల్ కాసాగింది.

సంబంధిత సమాచారం :