రామ్ గోపాల్ వర్మ ‘డేంజరస్’ మూవీ నుంచి ఖత్రా సాంగ్ రిలీజ్..!

రామ్ గోపాల్ వర్మ ‘డేంజరస్’ మూవీ నుంచి ఖత్రా సాంగ్ రిలీజ్..!

Published on Oct 22, 2021 10:15 PM IST


సంచలన సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ట్రీకీ మీడియా ప్రొడక్షన్ సమర్పణలో భారతదేశంలోనే మొట్టమొదటి లెస్బియన్/ క్రైమ్/ యాక్షన్/ లవ్ స్టోరీగా తెరకెక్కించిన సినిమా ‘డేంజరస్’. ఈ సినిమాలో నైనా గంగూలీ, అప్సరా రాణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుప్రీమ్ కోర్ట్ సెక్షన్ 377 ను రద్దు చేసి స్వలింగ సంబంధాలను చట్టబద్ధం చేసిన దృష్ట్యా రూపొందించిన ఈ సినిమా స్ట్రీమింగ్ ప్లాటుఫారంలో పే పర్ వ్యూ మోడల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది.

అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా డేంజరస్ చిత్రాన్ని బ్లోక్ చైన్‌లో ఎన్ఎఫ్‌టిగా అమ్మకానికి ఉంది. దీనిని ఫియట్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఆసక్తి ఉన్న వారు డేంజర్ టోకెన్స్ కొనుగోలు చేసి ఇందులో పార్టనర్స్ గా లేదా డేంజరస్ సినిమాని పూర్తిగా కుడా సొంతం చేసుకోవచ్చు. పెట్టుబడికి తగిన మోతాదులో రెవిన్యూ షేరింగ్‌కి గల అన్ని మార్గాల ద్వారా లాభం పొందడానికి అవకాశం ఉంది. కాగా ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయం ప్రతి పెట్టుబడిదారుడి ఇన్వెస్ట్మెంట్ రేషియోకు అనుగుణంగా ఇవ్వబడును. అయితే ఈ రోజు డేంజరస్ చిత్రంలోని ఖత్రా పాటను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను www.rgvdangertoken.com లో చూడవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు