కేఏ పాల్ పై రామ్ గోపాల్ వర్మ ఫన్నీ ట్వీట్స్ !

కేఏ పాల్ పై రామ్ గోపాల్ వర్మ ఫన్నీ ట్వీట్స్ !

Published on Nov 6, 2022 10:36 PM IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే.. వివాదానికి కేంద్ర బిందువు. తన గురించి ఎవరు ఏమనుకుంటారో ? తన పోస్ట్ ల పై ఎదుటి వ్యక్తులు ఎలా ఫీల్ అవుతారో ? లాంటి వాటి గురించి వర్మ అస్సలు ఆలోచించడు. వర్మ అంటేనే కాంట్రవర్సీ. తాజాగా ‘కేఏ పాల్’ పై వర్మ మరోసారి తన ట్వీట్స్ తో రెచ్చిపోయాడు. మునుగోడు ఉపఎన్నికల్లో కేఏ పాల్ డిపాజిట్‌ కోల్పొయిన సంగతి తెలిసిందే.

అందుకే, వర్మ కేఏ పాల్ పై సెటైర్లు వేశారు. ‘KA పాల్ ISIS మరియు ALQAEDAలోని తన స్నేహితులను మునుగోడు నియోజకవర్గంలో బాంబులు వేయడానికి ఉపయోగిస్తున్నారని ఇప్పుడే విన్నాను .. హే మునుగోడు ప్రజలారా త్వరగా పరిగెత్తండి.’ అంటూ వర్మ ఒక ఫన్నీ పోస్ట్ పెట్టాడు. ఇక కేఏ పాల్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం మంచిది అంటూ వర్మ.. కేఏ పాల్ కి ఒక సలహా ఇచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు