వామ్మో.. వర్మకి కూడా ఫీలింగ్స్ ఉన్నాయట?

Published on Mar 10, 2022 1:20 am IST


వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ ఎలాంటి స్వభావం కలిగినవాడో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన మాట తీరు, నడుచుకునే విధానం అందరికంటే భిన్నంగా ఉంటుంది. ఇక దానికి మించి ఆయన తీసే సినిమాలు గురుంచి అయితే పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి ఫీలింగ్స్ నాకు ఉండవని, నాకు నచ్చింది చేస్తా.. నాకు నచ్చినట్టే నేనుంటా అని ఎప్పుడూ చెప్పుకొచ్చే వర్మ తాజాగా తనకూ ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ కుక్కను ముద్దుగా దగ్గరకు తీసుకున్న ఫోటోను షేర్ చేసిన వర్మ.. నాలో కూడా ఫీలింగ్స్ ఉన్నాయని తెలిపాడు. అందరికి జంతువులు అంటే ఎంతో ఇష్టమో వర్మకు కూడా జంతువులు అంటే ఇష్టమట. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ ఫోటోపై నెటిజన్స్ భిన్నమైన రీతిలో స్పందిస్తూ వర్మలో కొత్త కోణం బయటపడిందని అంటున్నారు.

సంబంధిత సమాచారం :