రామ్ గోపాల్ వర్మ “కొండా” చిత్రం ప్రారంభం..!

రామ్ గోపాల్ వర్మ “కొండా” చిత్రం ప్రారంభం..!

Published on Oct 13, 2021 3:04 AM IST

సంచలన సినిమాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘కొండా’ పేరుతో మరో బయోపిక్‌కి శ్రీకారం చుట్టారు. వరంగల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రం వరంగల్‌లో ప్రారంభం అయింది. అదిత్‌ అరుణ్, ఇర్రా మోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కంపెనీ ప్రొడక్షన్‌ సమర్పణలో యోయో టాకీస్‌ పతాకంపై మల్లారెడ్డి, నవీన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ “నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. విజయవాడలో చదువుకున్నాను, ఆంధ్రలో జరిగిన చరిత్ర అంత తెలుసు కానీ తెలంగాణ చరిత్ర అంతగా తెలీదు. అయితే కొండా మురళి గారి చరిత్ర చాలా గొప్పగా నచ్చింది. వాళ్ళ జీవిత కథని అందరికి తెలియాలి అని కొండా చిత్రాని నిర్మిస్తున్నాము. నేను వీరి కథ, జీవితాల గురించి తెలుసుకున్న తర్వాత మహా దమ్మున్నోడు కొండా మురళి అని నేను తెలుసుకున్నాను.నేను ఒక ఫిల్మ్ మేకర్ ని ఎవరో జీవించిన వ్యక్తి గురించి నేను కొంతమంది ద్వారా తెలుసుకొని దాంట్లో నుంచి నాకు అర్థం అయిన సారాంశాన్ని తీయడం జరుగుతుంది. నాకు ఒక కొండ మురళి కథ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఏ డైరెక్టర్ కైనా తన కథ ఎంత ఫెంటాస్టిక్ ఉందనేది ముఖ్యం. కథ బాగా లేకపోతే ఏమి చేయలేడు.నేను శివ నుంచి స్టార్ట్ అయ్యి బాంబే నుంచి తీసిన సినిమాల నుంచి కావచ్చు నా సినీ చరిత్రలో విన్న మోస్ట్ ఎక్స్ట్రార్డినరీ కథ కొండా . కొండా మురళి, కొండా సురేఖ గార్ల కథను నేను నా టాలెంట్ తో వారి జీవిత చరిత్ర ను టెన్ పర్సెంట్ సినిమాలో పెట్ట గలిగినా కూడా నా ప్రయత్నం సక్సెస్ అయి కని విని ఎరుగని రీతిలో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. కొండ మురళి తో కలిసి నేను తిరిగిన తర్వాత నేను సురేఖమ్మ గారి కంటే మురళిని ఎక్కువ ఇష్టపడుతున్నాను. నేను చూసిన అందరిలో కంటే వీరు బెస్ట్ కపుల్స్. కొండ గారి కపుల్స్ ది చాలా యూనిక్ థింగ్ ఇలాంటి రిలేషన్ షిప్ తో ఉన్న ఫ్యామిలీ నేను ఇప్పటి వరకు చూడలేదు.అందుకే వీళ్ళకి నేను సెల్యూట్ చేస్తున్నాను. కొండా అనేది ఒక్క తెలంగాణకే పరిమితం కాకూడదని యూనివర్సల్ కావాలని ఈ సినిమా తీస్తున్నాను. కొండా లాంటి సినిమా ఇప్పటివరకు మీరు లైఫ్ లో చూసి ఉండరని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత ముకుంద్ మాట్లాడుతూ కొండా అభిమానులందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు వర్మ గారు చరిత్ర సృష్టించే సినిమాలు తీశాడు.తన సినీ చరిత్రలో ఇంకో చరిత్ర సృష్టించే సినిమా కొండా అవుతుంది. కొండా అనే స్టోరీ వర్మ గారు ఒక్కసారి టేకింగ్ చేస్తే ఎలా ఉంటుందనేది ఈసారి చూడబోతున్నాం. 30 సంవత్సరాల కింద వచ్చిన శివ ఒక లెవల్ అయితే ఇది వేరే లెవెల్ అవుతుంది. ఈ సినిమాతో ఊరిలో తిరిగే ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా ఇది కొండన్న మూవీ అని కచ్చితంగా చెప్పుకునే సినిమా అవుతుంది. వర్మ గారు ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేశారు కానీ ఇప్పుడు ఇంకొక సినిమా తీస్తున్నాం అంటున్నారు కానీ ఇది సినిమా కాదు నిజజీవితంలో మీ మధ్యలో ఉన్న కొండా దంపతులు ఎటువంటి ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొని దేనికి భయపడకుండా ఎలా దైర్యంగా నిల్చున్నారు అనేది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు .ఈ సినిమాతో కొండా దంపతులు సెన్సేషన్ క్రియేట్ చేయబో తున్నారని మేము చెప్పబో తున్నాను. అంతే కాదు ఆర్.జీ.వి మురళి ఇద్దరూ ఒకే దగ్గర చేరితే ఎలా ఉంటుందో మీకు ఈ సినిమా నిరూపిస్తుంది.అలాగే ఈ రెండు సునామీలు ఒక దగ్గర చేరినసపుడు ఇందులో ఒక సునామి చరిత్ర సృష్టించ బోతున్నారు అది రాబోయే ఎలక్షన్లలో చూడాలా..?

చిత్ర నిర్మాత ముకుంద్ మాట్లాడుతూ కొండా అభిమానులందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు వర్మ గారు చరిత్ర సృష్టించే సినిమాలు తీశాడు. తన సినీ చరిత్రలో ఇంకో చరిత్ర సృష్టించే సినిమా కొండా అవుతుంది. కొండా అనే స్టోరీ వర్మ గారు ఒక్కసారి టేకింగ్ చేస్తే ఎలా ఉంటుందనేది ఈసారి చూడబోతున్నాం. 30 సంవత్సరాల కింద వచ్చిన శివ ఒక లెవల్ అయితే ఇది వేరే లెవెల్ అవుతుంది. ఈ సినిమాతో ఊరిలో తిరిగే ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా ఇది కొండన్న మూవీ అని కచ్చితంగా చెప్పుకునే సినిమా అవుతుంది. వర్మ గారు ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేశారు కానీ ఇప్పుడు ఇంకొక సినిమా తీస్తున్నాం అంటున్నారు కానీ ఇది సినిమా కాదు నిజజీవితంలో మీ మధ్యలో ఉన్న కొండా దంపతులు ఎటువంటి ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొని దేనికి భయపడకుండా ఎలా దైర్యంగా నిల్చున్నారు అనేది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు .ఈ సినిమాతో కొండా దంపతులు సెన్సేషన్ క్రియేట్ చేయబో తున్నారని మేము చెప్పబో తున్నాను. అంతే కాదు ఆర్.జీ.వి మురళి ఇద్దరూ ఒకే దగ్గర చేరితే ఎలా ఉంటుందో మీకు ఈ సినిమా నిరూపిస్తుంది.అలాగే ఈ రెండు సునామీలు ఒక దగ్గర చేరినసపుడు ఇందులో ఒక సునామి చరిత్ర సృష్టించ బోతున్నారు అది రాబోయే ఎలక్షన్లలో చూడాలా అబి పశ్నించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు