వర్మ ‘కొండా’ నుండి ‘భలే భలే’ సాంగ్ రిలీజ్..!

Published on Dec 15, 2021 1:30 am IST


సంచలన సినిమాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘కొండా’ పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరంగల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ భర్త కొండా మురళి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అదిత్‌ అరుణ్, ఇర్రా మోర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కంపెనీ ప్రొడక్షన్‌ సమర్పణలో యోయో టాకీస్‌ పతాకంపై మల్లారెడ్డి, నవీన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

అయితే ‘కొండా’ షూటింగ్ ను కొద్ది రోజుల క్రితం వరంగల్‌లో మొదలు పెట్టారు. కానీ కొన్ని ఇబ్బందుల కారణంగా అక్కడ పూర్తి స్థాయిలో షెడ్యూల్‌ చేయలేకపోయామని, కొంత భాగం బయట చిత్రీకరించిన తర్వాత ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో తిరిగి వరంగల్‌లోనే షూటింగ్ చేస్తున్నామని వర్మ చెప్పారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ‘భలే భలే’ అనే విప్లవ గీతాన్ని రిలీజ్ చేశారు. సిరాశ్రీ రాసిన ఈ విప్లవ గీతాన్ని వరంగల్ గద్దర్‌తో కలిసి వర్మ పాడారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :