ఆర్జీవీతో మంత్రి పేర్ని నాని భేటీ.. ముహూర్తం ఫిక్స్..!

Published on Jan 8, 2022 3:01 am IST

ఏపీలో సినిమా టికెట్ల ధరల అంశంపై స్పందించిన సంచలన సినిమాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఇటీవల ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించిన సంగ్తి తెలిసిందే. వర్మ ప్రశ్నలకు మంత్రి నాని సున్నితంగానే జవాబులు ఇచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య రెండు రోజులు ట్విట్టర్ వార్ జరిగింది. చివరకు ప్రభుత్వంతో గొడవపడాలనేది తన ఉద్దేశం కాదని చెప్పిన వర్మ, అనుమతిస్తే మంత్రి పేర్ని నానిని కలిసి ఈ విషయంపై చర్చిస్తానని అన్నాడు. దీనికి పేర్ని నాని కూడా స్పందిస్తూ త్వరలోనే కలుద్దాం అని వర్మకు చెప్పాడు.

అయితే మంత్రి పేర్ని నానిని కలిసేందుకు తనకు పిలుపు వచ్చిందని తాజాగా ఆర్జీవీ ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. సినిమా టికెట్‌ ధరల విషయం గురించి మాట్లాడేందుకు పేర్ని నానిగారు నన్ను ఆహ్వానించారని తెలియజేసేందుకు ఆనందంగా ఉందని, ఈ మేరకు జనవరి 10వ తేదిన అమరావతి సచివాలయంలో మధ్యాహ్నం భేటీ అవుతున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు అని వర్మ తెలిపాడు.

సంబంధిత సమాచారం :