‘విశ్వక్ సేన్ – యాంకర్’ గొడవ పై వర్మ షాకింగ్ కామెంట్స్ !

Published on May 3, 2022 12:13 am IST


యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమా మే6న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఐతే, ప్రమోషన్స్‌ లో భాగంగా సినిమా బృందం ఒక ప్రాంక్‌ వీడియో చేసింది. కానీ.. ఈ వీడియో మిస్ ఫైర్ అయ్యింది. ఐతే ఈ వీడియో పై ఓ ప్రముఖ ఛానెల్ లో చర్చ జరిగింది. ఆ చర్చకు విశ్వక్ సేన్ కూడా హాజరు అయ్యాడు.

ఐతే, ఈ చర్చలో ఆవేశాలు పెరిగి, విశ్వక్ సేన్ ను సదరు యాంకర్ ‘గెట్ అవుట్’ అంటూ గట్టిగా అరిచి చెప్పింది. దాంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఐతే, ఈ వీడియోపై తాజాగా రామ్ గోపాల్ ట్వీట్ చేశాడు. ‘ఒక మగాడి కన్నా పవర్ ఫుల్గా ఉన్న ఒక మహిళను నేను ఇంతవరకు చూల్లేదు. ఆమె సర్కార్ కన్నా తక్కువేం కాదు’ అంటూ సదరు యాంకర్ను ట్యాగ్ చేస్తూ ఆర్జీవీ ట్వీట్ పెట్టాడు.

సంబంధిత సమాచారం :