‘నయీమ్’ సినిమా కోసం వర్మ పెద్ద రిస్క్ చేస్తున్నాడు !
Published on Sep 27, 2016 11:41 am IST

rgv1
క్రైమ్ కు సంబందించిన సినిమాలను తీయడంలో రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ముందుంటాడు. ముఖ్యంగా మనుషుల యదార్థమైన నేర చరిత్రను చూపడమంటే ఆయనకు మహా ఇష్టం. అందుకే ‘వంగవీటి’ తరువాత తెలుగులో మరే సినిమా తీయనన్న ఆయన ఇటీవల ఎన్ కౌంటార్ లో చనిపోయిన గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవిత చరిత్ర ఆధారంగా ‘నయీమ్’ పేరుతో సినిమాను తీసే పనిలో పడ్డాడు. అందుకోసం పెద్ద పెద్ద రిస్కులు కూడా చేస్తున్నాడు.

నయీమ్ కు సంబందించిన నేర చరిత్రను తెలుసుకోవడానికి అన్ని విధాలా ట్రై చేస్తున్నాడు వర్మ. ఎంతలా అంటే నయీమ్ తో సంబంధం ఉన్న క్రిమినల్స్ ను ముంబై జైలుకు వెళ్లి మరీ కలిశాడు. అలాగే నయీమ్ నక్సలైట్ గా ఉన్నప్పుడు సహచర్యం చేసిన ఇతర నక్సలైట్లను కలిశాడు. ఈ ప్రయత్నంలో నయీమ్ కు సంబందించిన షాకింగ్ నిజాలు తెలుసుకున్నాడట వర్మ. ఇలా నయీమ్ గురించి, అతని నేర సామ్రాజ్యం గురించి కూపీ లాగేటప్పుడూ తనకు నయీమ్ గ్యాంగ్ నుండి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని వర్మ చెబుతున్నాడు. అదే విధంగా ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ సినిమాను తీస్తానని కూడా బల్లగుద్ది చెబుతున్నాడు. మొత్తానికి వర్మ తాను అనుకున్నది చేయడానికి పెద్ద రిస్క్ చేస్తున్నాడు.

 
Like us on Facebook