‘రొమాంటిక్’ హీరోయిన్ కేతికకు థ్యాంక్స్ చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Published on Oct 30, 2021 3:01 am IST


డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి, కేతికా శర్మ కలిసి నటించిన చిత్రం “రొమాంటిక్”. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కలిసి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలై సూపర్ హిట్ టాక్‌ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమా చూసిన సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రొమాంటిక్ టీంకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

అయితే తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ట్విట్టర్ వేదికగా తన రివ్యూను ఇచ్చేశారు. రొమాంటిక్ భాషలో కంగ్రాట్స్ చెప్పిన వర్మ ఆకాష్ పూరిని రొమాంటిక్ థండర్ స్టార్ అని, కేతిక శర్మను రొమాంటిక్ హాట్ బ్యూటీ అంటూ కొనియాడారు. అయితే వీరిద్దరూ కూడా తమ కెమిస్ట్రీతో బాక్సాఫీస్ ను బర్న్ చేశారని, ఇలాంటి సినిమాను రూపొందించిన దర్శకుడు అనీల్ పాదూరి, నిర్మాతలు పూరి, ఛార్మిలకు సెల్యూట్ చెప్పారు. కాగా ఈ ట్వీట్‌కి స్పందించిన హీరోయిన్ కేతిక శర్మ వర్మకు థాంక్స్ చెప్పింది. దానికి వర్మ రిప్లై ఇస్తూ హే కేతిక మాకు హాట్ అండ్ రొమాంటిక్ ఫీల్ తెప్పించిన నీకు నేను, ఆడియన్స్ థాంక్స్ చెప్పాలని అన్నాడు.

సంబంధిత సమాచారం :

More