వైజాగ్ లో షూటింగ్ జరుపుకోనున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘హైపర్’

3rd, August 2016 - 09:18:44 AM

ram-hyper
నేను శైలజా వంటి సూపర్ హిట్ తో ఫామ్ లో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ ‘రామ్’ మరో క్రేజీ ప్రాజెక్టు శ్రీకారం చుట్టాడు. కందిరీగ ఫెమ్ ‘సంతోష్ శ్రీనివాస్’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హైపర్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసి ‘ప్రతి ఇంట్లో ఒకడుంటాడు’ అనే వెరైటీ ట్యాగ్ లైన్ కూడా పెట్టారు.

ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘అనిల్ సుంకర’ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ ను దాదాపు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగష్టు 5 నుండి వైజాగ్ లో కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనుంది. ‘జిబ్రాన్’ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ‘రాశి ఖన్నా’ రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.