హిట్ దర్శకుడితోనే సినిమా చేస్తున్న రామ్ !


యంగ్ హీరో రామ్ ‘హైపర్’ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని చాలా స్క్రిప్టులు విని, ఎన్నో తర్జన భర్జనల తర్వాత ఎట్టకేలకు తనకు మంచి హిట్టిచ్చిన దర్శకుడు కిశోర్ తిరుమల సినిమాకు సైన్ చేశాడు. ఈ చిత్రం ఈరోజే లాంఛనంగా ప్రారంభమైంది. కిశోర్ తిరుమల గతంలో రామ్ కు ‘నేను శైలజ’ వంటి కీలకమైన విజయాన్నందించాడు. నిజానికి కిశోర్ తిరుమల వెంకటేష్ తో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ సినిమా చేయాల్సి ఉన్నా కూడా కారణాలు బయటకు రాలేదు కానీ ఆడేందుకు వర్కవుట్ కాలేదు.

దీంతో రామ్ – కిశోర్ ల ప్రాజెక్ట్ సెట్టైపోయింది. స్రవంతీ మూవీస్ బ్యానర్ పై కిషోర్ నిర్మించనున్న ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, మేఘ అక్ష హీరోయిన్లుగా నటిస్తుండగా చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ కూడా ఈరోజు నుండే మొదలైంది. ఇక సినిమాకు సంబందించిన ఇతర నటీనటులు, టెక్నీకల్ టీమ్ ఎవరనే సంగతులు త్వరలోనే తెలియనున్నాయి.