వైరల్ అవుతోన్న రామ్ పోతినేని లేటెస్ట్ లుక్!

Published on Feb 14, 2023 8:07 pm IST


టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చివరిసారి గా ది వారియర్ చిత్రం లో కనిపించారు. ఈ హీరో ఇప్పుడు టాలీవుడ్ మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లో నటిస్తున్నారు. తాజాగా రామ్ పోతినేని ముంబై విమానాశ్రయం లో కనిపించారు. రామ్ లుక్ అద్బుతం గా ఉంది. మాస్ అవతార్ లో గుబురు గడ్డం, మీసాల తో సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు.

అయితే ఈ లుక్ బోయపాటి శ్రీను చిత్రం లోది అని తెలుస్తోంది. రామ్ లేటెస్ట్ లుక్స్ తో ఫ్యాన్స్ సంతోషం గా ఉన్నారు. ఈ చిత్రం లో విలన్ పాత్ర కోసం యంగ్ నటుడు ప్రిన్స్ ను తీసుకున్నారు మేకర్స్. బోయపాటి శ్రీను తన సినిమాల్లో విలనిజం కూడా పీక్స్ లో చూపిస్తారు. రామ్ పోతినేని కి తగ్గట్లు గా ప్రిన్స్ పాత్రను మరింత పవర్ ఫుల్ గా తీర్చి దిద్దునట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :