యంగ్ & ఎనర్జిటిక్ హీరో రామ్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. పెళ్లి కూతురు ఎవరో తెలుసుకోవాలంటే మీరు ‘పండగ చేస్కో’ సినిమా చూడడానికి థియేటర్ కు వెళ్ళాల్సిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రామ్ హీరోగా యునైటెడ్ మూవీస్ పతాకంఫై పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న సినిమా ‘పండగ చేస్కో’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. రామ్ వివాహం చేసుకునే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమెరికా నుండి ఇండియా వచ్చిన ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ నటిస్తున్నారు. అతని క్యారెక్టర్ చాలా స్టైలిష్ గా ఉంటుందని సమాచారం. బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ & రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
