‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సెన్సార్ డిటైల్స్ !

రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి కథానాయికలు. కిషోర్‌ తిరుమల దర్శకుడు. కృష్ణచైతన్య నిర్మాత. స్రవంతి రవికిషోర్‌ సమర్పిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరకర్త. ఈ మద్య విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇవ్వడం విశేషం. గతంలో కిషోర్ తిరుమల, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ‘నేను శైలజ’ సినిమా తరహాలో ఈ చిత్రం విజయం సాదిస్తుందేమో చూడాలి. ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.