రామ్ కొత్త సినిమా వివరాలు !

హీరో రామ్ నటించిన తాజా చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ పరువాలేదనిపించింది. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తరువాత రామ్ త్రినాద్ రావ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇద్దరు హీరోయిన్ ఈ సినిమాలో యాక్ట్ చెయ్యబోతునట్లు సమాచారం.

దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ తెరకేక్కబోతోంది. రామ్ చేస్తోన్న 16వ సినిమా ఇది. మెదట ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని వార్తలు వచ్చినా తాజా సమాచారం మేరకు మర్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. ప్రసన్న కుమార్ ఈ సినిమాకు సంభాషణలు సమకూరుస్తున్నాడు. లవ్ స్టోరి గా తెరకేక్కబోయే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు.