తనను సినీ పరిశ్రమ కి పరిచయం చేసిన డైరెక్టర్ కి బర్త్ డే విషెస్ తెలిపిన రామ్ పోతినేని!

Published on May 23, 2022 12:30 pm IST

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో రామ్ పోతినేని ఒకరు. కేవలం తన నటన తో మాత్రమే కాకుండా, డాన్స్ తో, యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకొనే రామ్ ను దేవదాసు చిత్రం తో తెలుగు సినీ పరిశ్రమ కి పరిచయం చేశారు వై.వి.ఎస్. చౌదరి. ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించిన వై.వి.ఎస్ చౌదరి పుట్టిన రోజు నేడు. ఈ పుట్టిన రోజు సందర్భంగా రామ్ సోషల్ మీడియా వేదిక గా బర్త్ డే విషెస్ తెలిపారు. అంతేకాక మీరు లేకపోతే ఈరోజు అనిపించేది కాదు అంటూ చెప్పుకొచ్చారు రామ్.

రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో బహుభాషా చిత్రం అయిన ది వారియర్ చిత్రం లో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఆది పినిశెట్టి కీలక పాత్ర లో నటిస్తుండగా, ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :