అఫీషియ‌ల్: ‘డ‌బుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

అఫీషియ‌ల్: ‘డ‌బుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Jun 15, 2024 4:03 PM IST

ఉస్తాద్ రామ్ పోతినేని న‌టిస్తున్న క్రేజీ సీక్వెల్ మూవీ ‘డ‌బుల్ ఇస్మార్ట్’ ఇప్ప‌టికే షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుండ‌గా.. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీపై సాలిడ్ బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్ర పోస్ట‌ర్స్ మూవీపై అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి. కాగా, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ పై మేక‌ర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీని ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ స‌రికొత్త పోస్ట‌ర్ తో అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాతో రామ్, పూరీల కాంబినేష‌న్ మరో బిగ్ హిట్ అందుకోవ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

‘డ‌బుల్ ఇస్మార్ట్’ సినిమాలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ మూవీలో యంగ్ బ్యూటీ కావ్య తాప‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా.. షాయాజీ షిండే, గెట‌ప్ శ్రీను త‌దితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తుండ‌గా చార్మీ కౌర్ తో క‌లిసి పూరీ జ‌గ‌న్నాధ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు