హరీష్ శంకర్ డైరెక్షన్ లో “రామ్ పోతినేని”?

Published on Jun 27, 2022 11:00 am IST


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని ది వారియర్ సినిమాతో అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ ద్విభాషా చిత్రం జూలై 14, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం లో రామ్ పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో మాస్ మూవీ చేయనున్నాడనేది తాజా గాసిప్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, అన్నీ కుదిరితే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. మరోవైపు రామ్ పోతినేని బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :