హీరో రామ్ పోతినేని తన 23వ చిత్రం ద్వారా దర్శకుడిగా మారబోతున్న సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ రాపో సినిమాటిక్స్ పై సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ స్వయంగా కథను అందిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.
ఈ సినిమాను భారీ స్థాయిలో నియో-నోయిర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నారు. ఇటీవల పాండిచ్చేరిలో జరిగిన షెడ్యూల్లో రామ్ ఏకధాటిగా 24 గంటల పాటు షూటింగ్లో పాల్గొని, ఒకే సమయంలో నటనతో పాటు దర్శకత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
అక్కడ భారీ సెట్లో 9 రోజుల పాటు షూటింగ్ సాగగా, వర్షాల కారణంగా కాస్త విరామం పడింది. త్వరలోనే మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి టీమ్ మళ్లీ పాండిచ్చేరి వెళ్లనుంది. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా, తిరు సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్ స్టంట్స్ మరియు ఎ.ఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు చూస్తున్నారు.
From the Fierce world of #RAPO23 in Pondicherry🔥
Energetic Star @ramsayz 🐺🖤#𝙍𝘼𝙋𝙊 @RAPO_Cinematics pic.twitter.com/s9IeaPXqTf
— RAPO Cinematics (@RAPO_Cinematics) August 17, 2026
