తన డైరెక్టర్ కి క్షమాపణ చెప్పిన రామ్ పోతినేని.!

Published on Jun 23, 2022 8:01 am IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ మాస్ అండ్ స్టార్ దర్శకుడు ఎన్ లింగుసామి కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ది వారియర్”. రామ్ కెరీర్ లో ఫస్ట్ పోలీస్ డ్రామాగా ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా మరో సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంలో మేకర్స్ ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే ఇదిలా ఉండగా తాజాగా తన డైరెక్టర్ కి మాత్రం రామ్ క్షమాపణలు చెప్పడం ఆసక్తిగా మారింది.

అసలు మెయిన్ మ్యాన్ కోసం చెప్పడం నేను మర్చిపోయానని నా వారియర్, దర్శకుడు నా చిత్రాన్ని మొదటి నుంచి తన భుజాలపై ఉంచి మోసిన లింగుసామి సార్ మీరు నేను వర్క్ చేసిన బెస్ట్ దర్శకుల్లో మీరు కూడా ఒకరు. దయచేసి క్షమించండి అంటూ ట్వీట్ చేసాడు. అయితే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో రామ్ లింగుసామి కోసం ఆ కంగారులో మాట్లాడలేదు దానికి సోషల్ మీడియాలో క్షమాపణ కోరాడు.

సంబంధిత సమాచారం :