రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RAPO 23’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర కోసం ముందుగా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ పేరును పరిశీలించారు. అయితే ఆయన డేట్లు సర్దుబాటు కాకపోవడంతో తమిళ నటుడు ఎస్.జె. సూర్యను సంప్రదించారు.
అయితే ఈ రోల్ కోసం ఎస్.జె. సూర్య ఏకంగా రూ. 8 కోట్ల భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో చిత్రబృందం వెనకడుగు వేసింది. పారితోషికం విషయంలో వ్యత్యాసం రావడంతో ఆయనను పక్కన పెట్టి, ఆ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
గతంలో రామ్, జెనీలియా కాంబినేషన్‌లో వచ్చిన ‘రెడీ’ సినిమా సమయం నుంచే వారి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో జెనీలియా రిఫరెన్స్‌తోనే రామ్ ఈ ప్రాజెక్ట్‌లోకి రితేష్‌ను తీసుకొచ్చినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
