సౌత్ ఇండియా లో ఏకైక హీరోగా రామ్ సెన్సేషనల్ రికార్డు.!

Published on Feb 26, 2022 1:58 pm IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా ఒకడు. మరి ఇప్పుడు మాస్ హీరో ఇమేజ్ ని తెచ్చుకున్న రామ్ ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ మాస్ ప్రాజెక్ట్స్ ని చేస్తూ బిజీగా ఉన్నాడు. మరి ఇది పక్కన పెడితే మన టాలీవుడ్ హీరోల సినిమాలు హిందీలో కూడా భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటాయన్న సంగతి తెలిసిందే.

మరి ఈ లిస్ట్ లో రామ్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి తన సినిమాలు ఇది వరకే సాలిడ్ రెస్పాన్స్ అందుకున్నవి చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలా తన సినిమాలు ఏకంగా ఓ సెన్సేషనల్ రికార్డును సెట్ చేసాయి. తన దేవదాసు సినిమా నుంచి ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు హిందీలో పలు యూట్యూబ్ ఛానెల్స్ లో రిలీజ్ చెయ్యగా వాటి అన్నిటికి కలిపి ఏకంగా 2 బిలియన్ వ్యూస్ వచ్చాయి.

దీనితో ఈ 2 బిలియన్ వ్యూస్ అందుకున్న ఏకైక దక్షిణాది హీరోగా రామ్ నిలిచి సెన్సేషనల్ రికార్డు అందుకున్నాడు. మరి ఇప్పుడు తన సినిమా “ది వారియర్” సినిమాతో హిందీలో కూడా గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు. మరి ఆ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :