వైరల్ పిక్ : “స్కంద” కోసం రామ్ సాలిడ్ మేకోవర్

Published on Sep 27, 2023 5:34 pm IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యంగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “స్కంద” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఫాన్స్ అండ్ మాస్ ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో రామ్ రెండు డిఫరెంట్ మెకోవర్స్ లో కనిపించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం కోసం రామ్ తన గత చిత్రాల కంటే హెవీగా కనిపిస్తున్నాడు. మరి ఇందు కోసమే తాను ముందు 72 కిలోలు నుంచి 82 కిలోలకి పెరిగాడట. దీనితో తన లేటెస్ట్ జిమ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. మరి ఇందులో రామ్ ఇంటెన్స్ మేకోవర్ ని అయితే మనం చూడొచ్చు. తాను మొదటిసారిగా ఇస్మార్ట్ శంకర్ కి 6 ప్యాక్ బాడీని ప్రిపేర్ చేయగా దానికి డబుల్ బీస్ట్ మోడ్ లో అయితే స్కంద కోసం రామ్ మారాడు. దీనితో ఈ పిక్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :