యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ RAPO22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
కాగా, ఈ సినిమాకు వివేక్-మర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ఇప్పటికే ప్రారంభించారు. తాజాగా ఈ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో హీరో రామ్ పోతినేనితో పాటు దర్శకుడు పి.మహేష్ బాబు కూడా జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Hyderabad music sessions for #Rapo22@ramsayz @filmymahesh @MervinJSolomon @MythriOfficial pic.twitter.com/rvEq84ritm
— Vivek Siva (@iamviveksiva) January 16, 2025