రామ్‌ పోతినేని “బుల్లెట్టు” సాంగ్ సరికొత్త రికార్డ్..!

Published on Jun 16, 2022 12:00 am IST

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది వారియ‌ర్‌’. ఇందులో రామ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కనిపించబోతున్నాడు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి రామ్‌కు జోడిగా యాక్ట్ చేస్తున్నారు. యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా న‌టిస్తున్నారు. అక్షరా గౌడ కీలక పాత్రలో క‌నిపించ‌నున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను జూలై 14న విడుద‌ల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన బుల్లెట్టు సాంగ్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ పాట మొత్తంగా 100 మిలియన్‌ క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా చిత్రబృందం తెలిపింది. ఈ సాంగ్‌ను కోలీవుడ్‌ స్టార్ హీరో శింబు, హరిప్రియ ఆలపించారు. తెలుగులో శ్రీమణి, తమిళంలో వివేక్ సాహిత్యం అందించిన, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. కాగా ఈ సినిమాలో ఈ ఒక్క పాట కోసమే నిర్మాతలు రూ. 3 కోట్లు ఖర్చు చేశారట.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :