రామ్ పోతినేని “ది వారియర్” టీజర్ వచ్చేసింది..!

Published on May 15, 2022 12:34 am IST


ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ది వారియ‌ర్‌’. ఇందులో రామ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కనిపించబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలయ్యింది.

ఈ టీజర్‌లో రామ్ మరింత ఎనర్జిటిక్‌గా కనిపించాడు. అతడి స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఓరియంటెడ్ లుక్, డైలాహ్ డెలివరీ అన్ని సూపర్బ్‌గా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ కూడా డిఫరెంట్‌గానే ఉన్నాయి. హీరోయిన్ కృతి శెట్టి కూడా రెండు, మూడు ఫ్రేంస్‌లో అందంగా కనిపించింది. ఇక విలన్‌గా నటించిన ఆదిపినిశెట్టి రగ్డ్ లుక్‌లో అదరగొట్టాడు. ఇకపోతే నదియా, అక్షర గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జూలై 14వ తేదిన విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :