రామ్ “ది వారియర్” టికెట్ ధరలు ఇవే!

Published on Jul 10, 2022 3:38 pm IST

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన ది వారియర్ జూలై 14, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తెలుగు – తమిళ చిత్రానికి లింగుసామి దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ డ్రామాలో కృతి శెట్టి, అక్షర గౌడ కథానాయికలు గా నటించడం జరిగింది. నైజాంలో ఈ మాస్ ఎంటర్‌టైనర్ టిక్కెట్ ధరలు ఇటీవల విడుదలైన అనేక బిగ్గీల మాదిరిగానే ఖరీదైనవి.

మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధర రూ. 295 కాగా సింగిల్ స్క్రీన్‌లలో రూ. 175 గా నిర్ణయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ ధరలు రూ. 147 మరియు సింగిల్ స్క్రీన్‌లు మరియు మల్టీప్లెక్స్‌లలో వరుసగా 177 రూపాయలు ఉన్నాయి. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, నదియా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం :