రామ్ “ది వారియర్” చార్ట్ బస్టర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Jun 25, 2022 3:00 pm IST


టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ మాస్ దర్శకుడు ఎన్ లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ మాస్ చిత్రం “ది వారియర్” కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసుకుంది. అయితే ఈ సినిమాకి సంగీతం అందించిన దేవి అండ్ కో రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ “బుల్లెట్టు” బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యింది.

జస్ట్ కొన్ని రోజులు కితమే ఈ చిత్రం 100 మిలియన్ వ్యూస్ అందుకోగా ఇప్పుడు ఈ కొద్దీ గ్యాప్ లోనే ఈ సాంగ్ తెలుగు మరియు తమిళ్ లో కలిపి 125 మిలియన్ వ్యూస్ ని హిట్ చేసింది. దీనితో ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తుండగా తెలుగు మరియు తమిళ్ లో వచ్చే జూలై 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :