రామ్ సేతు తో బాలీవుడ్ కి సత్యదేవ్…ఫలితం ఇదే!

రామ్ సేతు తో బాలీవుడ్ కి సత్యదేవ్…ఫలితం ఇదే!

Published on Oct 26, 2022 8:03 AM IST


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ గత కొన్నేళ్లుగా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో బిజీగా ఉన్న నటుడు. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ తన డ్రీమ్ రోల్ చేసి అందరినీ మెప్పించాడు. అయితే రామ్ సేతు సినిమాతో హిందీలో అడుగుపెట్టాడు సత్యదేవ్.

ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించగా, సత్యదేవ్ ఫుల్ లెంగ్త్ ముఖ్య పాత్రలో నటించారు. కానీ ఈ చిత్రం చాలా డల్ రివ్యూలతో స్టార్ట్ అయ్యింది. సత్యదేవ్ పాత్రకి మంచి ప్రశంసలు వస్తున్నా, సినిమా కాస్త డల్ గా ఉండటంతో హిందీలో ఈ యంగ్ హీరో అవకాశాలకు ఆటంకం కలిగిస్తుంది అని చెప్పాలి. సత్యదేవ్ ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజిగా ఉన్నారు. నెక్స్ట్ మూవీ తమన్నా తో గుర్తుందా సీతకాలం అనే చిత్రంలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు