యువ నటుడు రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ స్కంద. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ మూవీని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న స్కంద పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మితం అయింది. ఈ మూవీకి ఎస్ థమన్ అందించిన సాంగ్స్ ఇప్పటికే ఆడియన్స్ నుండి సూపర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి.
కాగా విషయం ఏమిటంటే, స్కంద ని యుఎస్ఏ లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు మేకర్స్. అక్కడ ఈ మూవీ 350 కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ కానుంది. అయితే ఇది రామ్ కెరీర్ లో అక్కడ రికార్డు రిలీజ్ అని తెలుస్తోంది. చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ వారితో కలిసి వర్ణిక విజువల్స్ వారు ఈ మూవీని యుఎస్ఏ లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ తరువాత స్కంద పై అందరిలో మరింతగా హైప్ పెరిగిందని, అలానే మూవీ కూడా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 28న పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.