లెజెండ్స్ సమక్షంలో ఈవెంట్ జరుపుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది – హీరో రామ్

Published on Jul 7, 2022 7:00 pm IST

రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్ మూవీ తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న చెన్నైలో ఎంతో వైభవంగా జరిగింది. కోలీవుడ్ కి చెందిన దిగ్గజ సినిమా ప్రముఖులు ఈ ఈవెంట్ కి విచ్చేసి ది వారియర్ యూనిట్ కి ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ తెలియచేసారు. ముఖ్యంగా ప్రఖ్యాత దర్శకుడు శంకర్, మణిరత్నం ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారు మాట్లాడుతూ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి తీస్తున్న ది వారియర్ ట్రైలర్, సాంగ్స్ కి ఇప్పటికే ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడం జరిగిందని, హీరో రామ్ తెలుగులో మంచి క్రేజ్ కలిగిన యాక్టర్ అని, తొలిసారిగా లింగుస్వామితో చేస్తున్న ఈ ద్విభాషా సినిమా తెలుగుతో పాటు ఇటు తమిళ్ లో కూడా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుతున్నట్లు మాట్లాడుతూ చెప్పారు.

ఇక నిన్నటి ఈవెంట్ ఎంతో అద్భుతంగా జరగడంతో దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేసారు హీరో రామ్. తొలిసారిగా తమిళ చిత్రపరిశ్రమకి ది వారియర్ మూవీతో ఎంట్రీ ఇస్తున్న తనకు, తమ మూవీ యూనిట్ కి అభినందనలు తెలియచేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ముఖ్యంగా అంతమంది లెజెండ్స్ సమక్షంలో మా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రామ్ తన పోస్ట్ లో తెలిపారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ ఈ నెల 14 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :