భారీ ధరకు అమ్ముడైన రామ్ ‘ది వారియర్’ మూవీ రైట్స్ … !

భారీ ధరకు అమ్ముడైన రామ్ ‘ది వారియర్’ మూవీ రైట్స్ … !

Published on Jul 1, 2022 1:02 AM IST

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్. కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీకి లింగుస్వామి దర్శకత్వం వహించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ అందించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఈ మూవీ నుండి ఇటీవల విడుదలైన సాంగ్స్, టీజర్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీపై బాగా హైప్ క్రియేట్ చేసాయి. రామ్ ఈ మూవీలో పోలీస్ అధికారిగా నటిస్తుండగా విలక్షణ నటుడు ఆదిపినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని దర్శకుడు లింగు స్వామి ఎంతో అద్భుతంగా తెరకేక్కిన్చారని అంటోంది యూనిట్.

అయితే ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని జులై 1న విడుదల చేస్తున్నామని, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని అనంతపూర్ లోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీలో రేపు సాయంత్రం 5 గంటల నుండి జరుపనున్నట్లు ప్రకటించింది యూనిట్. అలానే ట్రైలర్ ని పక్కాగా రేపు రాత్రి 07 గం. 57 ని. లకు యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి అతిథులుగా బోయపాటి శ్రీను, కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ రానున్నారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఇప్పటికే ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ అధిక ధరకు అమ్ముడు కాగా, ఇటీవల ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ సంస్థ డిస్నీ హాట్ స్టార్ వారు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక జులై 14న ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. నదియా, భారతి రాజా, బ్రహ్మాజీ, చిరాగ్ జానీ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ మూవీకి సుజిత్ వాసుదేవ్ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు