రామ్ “ది వారియర్” సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Published on Jun 2, 2022 9:12 pm IST

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ది వారియ‌ర్‌’. ఇందులో రామ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో కనిపించబోతున్నాడు. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. చివరిదశ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు మేకర్స్. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 12:07 నిమిషాలకు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. ‘దడ దడ’ అంటూ నాయకానాయికల మధ్య ఈ పాట కొనసాగనుంది.

సంబంధిత సమాచారం :