రామ్ ‘ది వారియర్’ ప్రమోషన్స్ షురూ …!

రామ్ ‘ది వారియర్’ ప్రమోషన్స్ షురూ …!

Published on Jul 5, 2022 6:30 PM IST

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుస్వామి తీస్తున్న ది వారియర్ మూవీ పై రామ్ ఫ్యాన్స్ లో అలానే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ తోనే అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఇక సాంగ్స్ విడుదల తరువాత యూట్యూబ్ లో భారీ స్థాయి రెస్పాన్స్ అందుకోవడం బాగా ప్లస్ అయింది. అనంతరం రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ అందరిలో అంచనాలు మరింతగా పెంచింది.

దానితో తప్పకుండా తమ హీరో రామ్ ఈ మూవీతో పక్కాగా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈనెల 14న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించి నేటి నుండి హీరో రామ్ విరివిగా ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలెట్టారు. ప్రస్తుతం రామ్ పలు మీడియా ఛానల్స్ వారికి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. టీమ్ మొత్తం ది వారియర్ కోసం ఎంతో కష్టపడ్డారని, తప్పకుండా రిలీజ్ తరువాత మూవీ అందరి అంచనాలు అందుకుంటుందనే ఆశాభావాన్ని రామ్ వ్యక్తం చేసారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీని శ్రీనివాస చిట్టూరి నిర్మించగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు