రామ్ ‘ది వారియర్’ ట్రైలర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

రామ్ ‘ది వారియర్’ ట్రైలర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్

Published on Jun 28, 2022 9:00 PM IST

యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది వారియర్. ఇందులో రామ్ పోలీస్ అధికారిగా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు. మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్స్ కి యూట్యూబ్ లో సూపర్ గా రెస్పాన్స్ లభించింది. ఇక ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని జులై 1న రాత్రి 07 గం. 07 ని.లకు రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అధికారకంగా ప్రకటించించింది. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కిన ది వారియర్ మూవీ తప్పకుండా రిలీజ్ తరువాత పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ మూవీ జులై 14న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు