వరల్డ్ ప్రీమియర్ సిద్ధమైన “ది వారియర్”..!

వరల్డ్ ప్రీమియర్ సిద్ధమైన “ది వారియర్”..!

Published on Oct 23, 2022 8:12 AM IST

ఈ ఏడాది టాలీవుడ్ దగ్గర మంచి అంచనాలు మంచి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ది వారియర్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎన్ లింగుసామి తెరకెక్కించగా దీనికి మంచి ఓపెనింగ్స్ కూడా దక్కాయి.

కానీ చిత్రం అయితే అనుకున్నంత సక్సెస్ ని అందుకోలేదు. ఇక ఇదిలా ఉండగా ఈ వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. మరి ఈ చిత్రం శాటిలైట్ హక్కులని ప్రముఖ సంస్థ స్టార్ మా వారు కొనుగోలు చేయగా అందులో ఈ చిత్రం త్వరలో టెలికాస్ట్ కాబోతున్నట్టుగా కన్ఫామ్ అయ్యింది. మరి టెలికాస్ట్ డేట్ ఎప్పుడు అనేది రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు