సినిమా ప్రమోషన్ పై ద్రుష్టి పెట్టిన రామ్!

తెలుగులో ఎనర్జిటిక్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ తన కొత్త సినిమా ప్రమోషన్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఉన్నది ఒక్కటే జిందగీ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇక రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యంలో హీరో రామ్ సినిమా మీద ప్రత్యేక ద్రుష్టి పెట్టాడు. ఈ సినిమాలో రామ్ ఫుల్ ఎనర్జిటిక్ గా బ్యాండ్ పార్టీని నడిపే పాత్రలో చేస్తున్నాడు.

రామ్ చివరి చిత్రం హైపర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం ఈ సినిమా మీద మరింత బాద్యతగా ఉన్నట్లు తెలుస్తుంది. రామ్ కెరియర్ కి ఈ సినిమా చాలా కీలకం. ఈ నేపధ్యంలో ప్రమోషన్ మీద అతను ప్రత్యేక ద్రుష్టి పెట్టాడు. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా చేస్తుండగా. ఈ సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.